close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

తాజా వార్తలు

మేనకోడలిని చంపాడనే పగ

సోదరితో సహజీవనం చేస్తున్న వ్యక్తి హత్య

కాప్రా, న్యూస్‌టుడే: ఈసీఐఎల్‌లోని మహేష్‌నగర్‌లో ఈ నెల 17న జరిగిన శివారెడ్డి(30) హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుషాయిగూడ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి ఇన్‌ఛార్జి డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ శివకుమార్‌లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుషాయిగూడ మహేష్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళతో కొత్తపేటలోని మార్గదర్శికాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి గుర్రం శివారెడ్డి(30) మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. యూసుఫ్‌గూడలోని కార్మికనగర్‌లో నివసించే ఆమె సోదరుడు మన్నె శ్రీనివాస్‌, అతని భార్య సావిత్రిలు ఈ నెల 16న మహేష్‌నగర్‌కు వచ్చారు. ఆ రోజు మద్యం తాగిన శివారెడ్డి సావిత్రితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో శివారెడ్డితో గొడవ పడిన దంపతులు కర్రలతో తలకు బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిపై శ్రీనివాస్‌కు గతం నుంచే పగ ఉంది. తన మరో సోదరి కుమార్తె జ్ఞానేశ్వరి(6)ని హత్యకేసులో శివారెడ్డి నిందితుడు. మల్కాజిగిరి ఠాణా పరిధిలో జరిగిన ఈ హత్య కేసులో ఈ ఏడాది జూన్‌లో బెయిల్‌పై విడుదలయ్యాడు. దీంతో అతడిపై పగ పెంచుకున్న శ్రీనివాస్‌ భార్యతో అసభ్యంగా ప్రవర్తించడం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడి హత్యపై తండ్రి జి.కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం నిందితులను యూసఫ్‌గూడలోని కృష్ణానగర్‌ బస్టాప్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. నిందితులు తమనేరాన్ని ఒప్పుకుకోవడంతో కోర్టులో హాజరు పరిచారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రశేఖర్‌, ఎస్‌ఐలు శ్రీకాంత్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.