close

సోమవారం, అక్టోబర్ 21, 2019

తాజా వార్తలు

జలవనరుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే

ప్రొ.బి.వి.సుబ్బారావు

రెడ్‌హిల్స్‌: జలవనరులైన చెరువులు, కుంటల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతుందో.. అంతకన్నా ఎక్కువ బాధ్యత ప్రజలపై ఉందని ‘లేక్‌ ఎక్స్‌పర్ట్‌’ ప్రొ.బి.వి.సుబ్బారావు అభిప్రాయపడ్డారు. మన కళ్ల ముందు జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని మౌనంగా చూస్తున్నామని, ఈ నిర్లక్ష్యాన్ని భవిష్యత్‌ తరాలు క్షమించవన్నారు. ల్యాండ్‌ స్కేప్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌(ఎల్‌ఐఏఐ) ఆధ్వర్యంలో ‘లేక్‌ మేనేజ్‌మెంట్‌ ఎట్‌ హైదరాబాద్‌’ అంశంపై ఫ్యాప్సీ భవనంలో శనివారం జాతీయ సదస్సు నిర్వహించారు. హాజరైన ప్రొ.బి.వి.సుబ్బారావు కీలకోపన్యాసం చేస్తూ.. కనుమరుగవుతున్న వందల చెరువులు, కుంటల వల్లే నగరాన్ని వరద ముంచెత్తుతోందన్నారు. సాగర్‌ ప్రక్షాళనకు ఏడాదికి రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం లేదన్నారు. ఐఐఏ తెలంగాణ చాప్టర్‌ కార్యదర్శి ఆర్కిటెక్ట్‌ శంకరనారాయణ అధ్యక్షతన ల్యాండ్‌ స్కేప్‌ ఆర్కిటెక్ట్‌ శ్రీదేవిరావు నిర్వహణలో సదస్సు జరిగింది. ఎల్‌ఐఏఐ(న్యూదిల్లీ) ఉపాధ్యక్షులు ప్రమోద్‌ స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.