close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

తాజా వార్తలు

భావోద్వేగ రుగ్మతలకు మనస్తత్వశాస్త్రంలో పరిష్కారం

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: సమాజంలో భావోద్వేగాలతో ఏర్పడే రుగ్మతలను తొలగించడంలో మనస్తత్వశాస్త్రంలో కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ విధానం కీలకపాత్ర పోషించగలదని తెలంగాణ మనస్తత్వవేత్తల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ మోతుకూరి రాంచందర్‌ పేర్కొన్నారు. హైదర్‌గూడలోని ఒక హోటల్‌లో శనివారం తెలంగాణ మనస్తత్వవేత్తల సంఘం ఆధ్వర్యంలో కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ అంశంపై నిర్వహించిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. వ్యక్తుల్లో భావోద్వేగాలు, ఆలోచనా ధోరణులను పసిగట్టి మార్పులు తీసుకోవడంలో మనస్తత్వశాస్త్రం విశేషంగా దోహదపడగలదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడులకు లోనై మానసిక ఉద్వేగంతో అనర్థాలు కొనితెచ్చుకుంటున్నారని, ఇలాంటి సమస్యలను మనస్తత్వశాస్త్రం ద్వారా పరిష్కరించుకోగలమని చెప్పారు. బెంగళూరుకు చెందిన మనస్తత్వశాస్త్ర ప్రొఫెసర్‌ డాక్టర్‌ మంజుల మాట్లాడుతూ.. భిన్నరకాల మానసిక రుగ్మతలకు, క్లినికల్‌ సమస్యలకు కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ (సీబీటీ) ద్వారా చికిత్స అందించవచ్చని చెప్పారు. రుగ్మతలకు గురైన వ్యక్తి గత జీవితానుభవాలను, అప్రయోజనాత్మక ఆలోచనలను పరిశీలనలోకి తీసుకొని ఈ విధానంలో మార్పులు తీసుకురాగలమని వివరించారు. కార్యశాలలో మనస్తత్వవేత్తలు డాక్టర్‌ పౌలోమి, డాక్టర్‌ సుధీర్‌, వినీష, శాంతి, జె.వి.జి.సురేష్‌, వెంకటేశ్వర్లు, శివరామప్రసాద్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.