శుక్రవారం, డిసెంబర్ 06, 2019
మత్స్యకారులకు చేప విత్తనాలు అందిస్తున్న ఏడీ రాజారాం
నాళేశ్వర్(నవీపేట), న్యూస్టుడే: నాళేశ్వర్ మత్స్యకారులకు మత్స్యశాఖ జిల్లాధికారి రాజారాం బుధవారం చేప విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం వాటిని స్థానిక చెరువుల్లో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ప్రభుత్వం వందశాతం రాయితీపై వీటిని పంపిణీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీవో రాజనర్సయ్య, సర్పంచి సరీన్, ఎంపీటీసీ సభ్యురాలు శ్యామల, సాయిలు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు