సోమవారం, డిసెంబర్ 09, 2019
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వర్షపునీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091అడుగులు కాగా, గురువారం ఉదయం 9గంటలకు ప్రాజెక్టులో 1082.40అడుగుల నీరు ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 52,591 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరదనీరు మరింతగా చేరే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 59.212టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు