close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

తాజా వార్తలు

వెంటాడాడు.. పట్టుకున్నాడు

శునకం మృతికి కారణమైన క్యాబ్‌డ్రైవర్‌ పోలీసులకు అప్పగింత

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: వేగంగా వచ్చిన కారు ఢీకొని ఓ శునకం మృత్యువాత పడింది. ఆ ఘటన చూసి అందరిలా అతను నాకెందుకులే అనుకోలేదు. ఆ శునకం మృతికి కారణమైన కారు డ్రైవరును వెంటాడి పట్టుకున్నాడు. పోలీసులకు అప్పగించాడు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు-2 నుంచి కేబీఆర్‌ ఉద్యానవనం మీదుగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రాజేంద్రనగర్‌ ఎంఎంపహాడ్‌కు చెందిన ఎం.డి.అబ్దుల్‌ నయీం (24) క్యాబ్‌ను వేగంగా నడుపుతూ వస్తున్నాడు. కేబీఆర్‌ ఉద్యానవనం పాదచారుల బాట నుంచి రోడ్డు దాటుతున్న ఓ వీధికుక్కను ఆ కారు ఢీకొనడంతో మృత్యువాత పడింది. మరో కారులో వస్తున్న కంపాసియోనేట్‌ సొసైటీ ఫర్‌ ఎనిమల్స్‌ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన అజయ్‌ గమనించి రక్తపు మడుగులో ఉన్న శునకాన్ని తన కారు డిక్కీలో వేసుకొని ప్రమాదానికి కారణమైన కారును వెంబడించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ఆ కారును అడ్డగించాడు. డ్రైవరును పట్టుకుని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఆ సంస్థ నిర్వాహకురాలు ప్రవళ్లిక అక్కడికి చేరుకున్నారు. శునకం మృతికి కారణమైన డ్రైవరుపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అజయ్‌ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు జంతుహింస చట్టం కింద కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.