close

సోమవారం, అక్టోబర్ 21, 2019

తాజా వార్తలు

ఫ్యాషన్‌ షోతో అలరించిన చిన్నారులు

హైదరాబాద్‌: ముద్దులొలికే చిన్నారులు ర్యాంప్‌పై సందడి చేశారు. చిన్ని చిన్ని నడకలతో ప్రేక్షకులను అలరించారు. చూడముచ్చటైన వస్త్రధారణతో అందంగా తయారై చూపరులను కట్టిపడేశారు. చిన్నారుల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు ‘కిడ్స్‌ ఫ్యాషన్‌ ఫ్యూజన్‌ వీక్‌’ పేరుతో నగరంలోని ఓ హోటల్‌లో కిడ్స్‌ ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సంప్రదాయ పంచకట్టు, మోడ్రన్‌ డ్రెస్‌ వంటి రంగురంగుల దుస్తుల్లో ర్యాంప్‌పై క్యాట్‌ వాక్‌తో కనువిందు చేశారు. బెంగళూరు, పుణె, దిల్లీ, కోల్‌కతా, పట్నా, హైదరాబాద్‌ నుంచి చిన్నారులు ఈ ఫ్యాషన్‌ షోలో పాల్గొని సందడి చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.