close

సోమవారం, అక్టోబర్ 21, 2019

తాజా వార్తలు

విమానాశ్రయంలో కారును ఢీకొన్న బైక్‌

ఉద్యోగికి తీవ్ర గాయాలు

శంషాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: ముందు వెళ్తున్న కారును బైక్‌ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. శంషాబాద్‌ విమానాశ్రయ ప్రధాన ద్వారం సమీపంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్జీఐఏ పోలీసుల కథనం ప్రకారం.. జి.అనీశ్‌రెడ్డి(22) శంషాబాద్‌ ఆర్బీనగర్‌లో ఉంటూ.. విమానాశ్రయంలో క్యాటరింగ్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బైక్‌పై శంషాబాద్‌కు వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌ ప్రధాన ద్వారం సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న ఓ కారు డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో బైక్‌ అదుపు తప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న అనీశ్‌రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో హెల్మెట్‌ ఉన్నా తలకు ధరించకుండా ఉండటంతో తీవ్ర గాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.