close

శుక్రవారం, నవంబర్ 22, 2019

తాజా వార్తలు

అవినీతి అరికట్టేందుకే నూతన విధానం


అదనపు ఐజీ ఉదయ్‌ భాస్కర్‌రావుతో కర్నూలు, పాణ్యం శాసన సభ్యులు హఫీజ్‌ఖాన్‌, కాటసాని

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మధ్యవర్తుల ప్రమేయం, అవినీతి అరికట్టేందుకు ఆన్‌లైన్‌లో స్వీయ దస్తావేజుల రచన విధానం ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌శాఖ అదనపు ఐజీ ఎం.ఉదయ్‌ భాస్కర్‌రావు తెలిపారు. నగరంలోని జిల్లా పరిషత్తులో సబ్‌ రిజిస్ట్రార్లు, ఆ శాఖ సిబ్బందికి సోమవారం ఉదయం, మధ్యాహ్నం ఆన్‌లైన్‌లో ప్రజలు స్వయంగా దస్తావేజులు రూపొందించుకునే విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఐజీ మాట్లాడుతూ కృష్ణా, విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం మంచి ఫలితాలు సాధించిందన్నారు. నవంబర్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. ప్రజలు సులభతరంగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తులో వివరాలు నమోదు చేసి దస్తావేజులు తయారు చేసుకోవచ్చన్నారు. డబుల్‌ రిజిస్ట్రేషన్‌గాని ఇతరత్రా తప్పిదాలకు పాల్పడితే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ డబుల్‌ రిజిస్ట్రేషన్‌ జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ దళారుల జోక్యాన్ని అరికట్టేందుకు ప్రవేశపెట్టిన విధానం బాగుందన్నారు. టెక్నికల్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌, నిక్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి నూతన విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ డీఐజీ కిరణ్‌కుమార్‌, జిల్లా రిజిస్ట్రార్‌ నాగభూషణం, ఆడిట్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌.ఆంజనేయులు, నంద్యాల రిజిస్ట్రార్‌ ఉషారాణి, సబ్‌ రిజిస్ట్రార్లు ఆ శాఖ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

సదస్సుకు స్పందన కరవు: ఆన్‌లైన్‌లో దస్తావేజుల రచనపై స్టాంప్స్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ జిల్లా పరిషత్తులో నిర్వహించిన అవగాహన సదస్సుకు స్పందన కరవైంది. సబ్‌ రిజిస్ట్రార్లు, ఆ శాఖ ఉద్యోగులు మినహాయిస్తే ప్రజలు పెద్దగా హాజరుకాలేదు. వచ్చిన వారిలో అధికంగా దస్తావేజు లేఖరులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఏజెంట్లు ఉన్నారు. అధికారులు ముందస్తు ప్రణాళికతో ప్రచారం చేయకపోవటంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.