close

మంగళవారం, నవంబర్ 12, 2019

తాజా వార్తలు

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళన

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

నర్సంపేట, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే ప్రభుత్వానికి పతనం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 12 రోజులకు చేరిందని వివిధ రూపాల్లో కార్మికులు ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా సర్కారు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సమ్మె కొనసాగుతుంటే కార్మికులపై సానుభూతితో వ్యవహరించకుండా వారిని రెచ్చగొట్టేలా మాట్లాడడం శోచనీయమన్నారు. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు బాధ్యత విస్మరించి చేసిన వ్యాఖ్యలే కార్మికుల ఆత్మహత్యలకు కారణమన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు అధికార పార్టీ నాయకులు కుయుక్తులు చేస్తున్నారని అదే క్రమంలో కార్మికుల సమ్మె అణిచివేతకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 48వేల మంది కార్మికుల జీవితాలతో కేసీఆర్‌ చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.ఇప్పటికైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా కార్మికులతో చర్చలు జరిపి న్యాయమైన వారి డిమాండ్లను తీర్చాలన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా ప్రభుత్వం స్పందించి సమ్మె విరమణకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, పోరాటాలు ఉద్ధృతం చేస్తామన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రంగయ్య, రాష్ట్ర నాయకులు నాగయ్య, జి.రాములు, టి.జ్యోతి, జిల్లా నాయకులు బాబు, సమ్మయ్య, కుమారస్వామి, రమేశ్‌, వీరాచారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.