close

మంగళవారం, నవంబర్ 19, 2019

తాజా వార్తలు

తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయండి

 పోలింగ్‌ కేంద్రాలకు జియో ట్యాగింగ్‌ ●

19, 20 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల పరిశీలన

వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా పాలనాధికారి భరత్‌ గుప్తా, డీఆర్వో విజయచందర్‌

చిత్తూరు(జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే : తప్పులు లేని ఫొటో ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్‌ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం అమరావతి నుంచి జిల్లా పాలనాధికారి, నియోజకవర్గ ఓటరు నమోదు అధికారులతో వీడియో సమావేశం ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ముసాయిదా ఓటర్ల జాబితాను పక్కాగా సిద్ధం చేయాల్సి ఉందని, ఇందుకోసం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ఈవీపీ(ఓటరు పరిశీలన కార్యక్రమం) పక్కాగా చేపట్టాలన్నారు. ఓటరు పరిశీలన కార్యక్రమాన్ని వచ్చే నెల 18వ తేదీ వరకు పొడిగించామని, నవంబరు 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లు చెప్పారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించే నాటికి ఓటర్ల జాబితాలో తప్పులను పూర్తిస్థాయిలో గుర్తించి సరి చేయాలని, పోలింగ్‌ కేంద్రాల పరిధిని సూచిస్తూ జియోట్యాగింగ్‌ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సరిహద్దులను సూచిస్తూ పోలింగ్‌ కేంద్రాలను జియోట్యాగింగ్‌ చేపట్టాలని, దీంతో పాటుగా పోలింగ్‌ కేంద్రాల క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలన్నారు. 1,500 మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటే అదనపు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈనెల 19, 20వ తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ప్రత్యేక ఓటరు పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు. వీడియో సమావేశంలో జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ల పరిశీలన కార్యక్రమం 63 శాతం పూర్తి చేశామని, ఈనెల 25వ తేదీలోగా మొత్తం పూర్తిస్తామని వివరించారు. ఇప్పటి వరకు అందిన క్లైముల పరిష్కారం వేగంగా చేస్తున్నామని చెప్పారు. 19, 20వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల పరిశీలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని సీఈవోకు వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయచందర్‌, చిత్తూరు ఆర్డీవో రేణుక, ఎన్నికల తహసీల్దారు బలరాం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.