close

ఆదివారం, నవంబర్ 17, 2019

తాజా వార్తలు

డెంగీపై పరిశోధనలు జరుపుతున్నాం

‘ఆరోగ్యశ్రీ’ని తప్పు పట్టడం లేదు
ఈఎస్‌ఐ ఔషధాల కొనుగోలులో కొత్త విధానం!
ఈ-సిగరెట్ల నిషేధం అమలుకు రాష్ట్రాల సహకారం అవసరం
ఈనాడు’తో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే

‘‘డెంగీ లాంటి జ్వరాలతో ఆస్పత్రులకు వచ్చే రోగుల విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాలి. అన్ని జ్వరాలూ డెంగీ కాదు. దీనిపై పరిశోధనలు నిర్వహిస్తున్నాం’’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే పేర్కొన్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల ఔషధాల కొనుగోళ్లలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు కార్మిక మంత్రిత్వశాఖ, రాష్ట్రాలతో కలిసి ఒక విధానాన్ని తమ శాఖ రూపొందించే ఆలోచనలో ఉందని చెప్పారు. తాను ఆరోగ్యశ్రీని తప్పు పట్టడంలేదన్నారు. ఈ-సిగరెట్ల నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరమన్నారు. హైదరాబాద్‌ వచ్చిన ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో  ప్రస్తావించిన ముఖ్యాంశాలు.

రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు ఆరోగ్యశ్రీ ఫలితాలను చూడకుండా ఆయుష్మాన్‌భవ గురించి మాట్లాడుతున్నారు
ఆరోగ్యశ్రీని నేను తప్పుపట్టడం లేదు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మంచి సేవలనే అందిస్తోంది. అయితే, దీని లబ్ధిదారులు ఇక్కడికే పరిమితం. ఆయుష్మాన్‌భవ పథకాన్ని వర్తింపచేస్తే దేశంలో ఎక్కడైనా అవసరమైన వైద్యసేవలను పేదలు పొందవచ్చు.

ఈ- సిగరెట్లు నిషేధించినా మార్కెట్లో లభిస్తున్నాయి
అవును. ఇంకా అవి మార్కెట్లో లభిస్తున్నట్లు మాకూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ-సిగరెట్లపై కేంద్రం విస్తృత స్థాయిలో అధ్యయనం చేయించింది. వాడుతున్న వారిలో 95 శాతం మంది 19 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వారే. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వాటిల్లో కొందరు మాదకద్రవ్యాలు కలుపుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. తయారీదారులు, దిగుమతిదారులను గుర్తించాం. వీటిపై నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే రాష్ట్రాలు చొరవచూపాలి. ఈ విషయంలో వారికి లేఖలు రాస్తున్నాం.

కేన్సర్‌ బారిన పడుతున్న పేదలను   ఆదుకోవాలన్న ఆలోచన ఏస్థాయిలో ఉంది?
కేన్సర్‌ బాధితులను ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో రోగులు దీన్ని ఉపయోగించుకుంటున్నారు.

డెంగీ పేరుతో కార్పొరేట్‌ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి
ఆస్పత్రులు మానవతాదృక్పథంతో వ్యవహరించాలి. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మునుపటితో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రులకు వెళ్లినా ఖర్చులు తగ్గుతాయి. వైద్యులు కూడా కేసు తీవ్రతను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు.

ఈఎస్‌ఐలలో మందుల కొనుగోలు సమయంలో అవినీతి పెచ్చుమీరుతోంది
తెలంగాణలో పెద్ద కుంభకోణం జరిగినట్లు విన్నాను. ఇక్కడే కాదు పలు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఆస్పత్రులను కార్మిక మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది. ఔషధాల కోనుగోలు విషయంలో రెండు మంత్రిత్వశాఖలు సమన్వయంతో వ్యవహరించాలన్న అభిప్రాయం పరిశీలనలో ఉంది. రాష్ట్రాలను కూడా భాగస్వాముల్ని చేసి ఒక విధానాన్ని రూపొందించాలన్న ఆలోచన ఉంది. అది త్వరలో కార్యరూపంలోకి వస్తుంది.

డెంగీ తదితర జ్వరాలు దేశంలో ప్రబలుతున్నాయి. ముందు జాగ్రత్తలు ఎందుకు చేపట్టలేకపోతున్నారు?
అనేక రాష్ట్రాల్లో ఈ జ్వరాలు ఉన్నమాట వాస్తవమే. అన్ని కేసులు డెంగీ అని చెప్పలేం. డెంగీపై ఎక్కడికక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. అధిక శాతం సీజనల్‌ వ్యాధులే ఉన్నాయి. ప్లేట్‌లెట్స్‌ అనూహ్యంగా పడిపోతుంటే డెంగీ లక్షణాలు ఉన్నట్లు. ప్లేట్‌లెట్స్‌ 20వేల కన్నా తగ్గినప్పుడే వాటిని ఎక్కించే అంశాన్ని పరిశీలించాలి. పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమిస్తే సింహభాగం పరిష్కారం లభిస్తుంది. డెంగీ మృతులు ఉన్నట్లు పత్రికల్లో చూస్తున్నామే తప్ప రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించడం లేదు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

తెలుగుకు జై కొట్టు.. ఆంగ్లాన్ని ఒడిసిపట్టు!

మాతృభాషలో బోధనతోనే మేధో వికాసం.. సాహితీవేత్తల మనోగతం తెలుగు అజంత భాష. అచ్చులతో అంతమయ్యే శబ్దాలు ఉండటం వల్ల ఈ పేరొచ్చింది. ఇటాలియన్‌ కూడా అజంత భాషే. దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు మాతృభాష తుళు. అయినా తాను ‘తెలుగు వల్లభుండ తెలుగొకండ’ అని గర్వంగా చెప్పుకొన్నారు. అవధాన ప్రక్రియ తెలుగు సాహిత్యానికే ప్రత్యేకం. ఇలాంటి సాహితీ చమక్కు మరే భాషలోనూ లేదు. క్రీస్తుపూర్వం 500 ఏళ్ల ముందు నుంచే తెలుగు శాసనాలు ఉన్నాయి. వెలనాటి చోడులు తెలుగును అధికార భాషగా ప్రకటించిన తొలి రాజులు. మారిషస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సాగే రేడియోలో రోజూ గంటపాటు తెలుగు కార్యక్రమాలకు

ముంబయి అంతే.. హైదరాబాద్‌ ఇంతే!

ప్రపంచంలోని వంద ప్రధాన నగరాల్లోని రహదారుల స్థితిగతులపై సర్వే నిర్వహిస్తే.. దేశ ఆర్థిక రాజధాని ముంబయి చివరి స్థానంలో నిలిచింది.. సగటు మనిషి ప్రయాణ వ్యయం, పెట్రోలు ధర, వార్షిక రహదారి పన్ను తదితర అంశాల్లో చిట్ట చివర నిలిచింది. యూరోపియన్‌కు చెందిన కారు విడి భాగాల విక్రయ సంస్థ ‘మిస్టర్‌ ఆటో’ ఈ సర్వే చేపట్టింది. వంద నగరాల్లో మొత్తంగా కెనడాలోని కల్గరీ నగరం తక్కువ వాహన రద్దీ, రోడ్డు ప్రమాదాల మరణాలు, సరసమైన ప్రయాణ వ్యయంతో ఉత్తమంగా నిలిచింది. ఈ నేపథ్యంలో.. ముంబయి రహదారులు బాగుంటాయని కితాబిచ్చిన నగర యంత్రాంగం, హైదరాబాద్‌ నగరం సర్వేలో ఉండి ఉంటే ఏ స్థానం దక్కేదో అంచనా వేసుకోవాలి. ప్రపంచ పర్యాటకులు భాగ్యనగరం వైపు చూస్తోన్న తరుణంలో..

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.