close

మంగళవారం, నవంబర్ 12, 2019

తాజా వార్తలు

173 మద్యం దుకాణాలకు 1499 దరఖాస్తులు

ఆబిడ్స్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ జిల్లాలో 173 మద్యం దుకాణాలకు 1499 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం ఇదే మొదటిసారి. ఈనెల 9న మొదలైన మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ బుధవారం అర్ధరాత్రితో ముగిసింది. ఈనెల 18న ఉదయం ఎక్సైజ్‌శాఖ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ మొదలవుతుంది. ఈ కేటాయింపు లాటరీ పద్ధతిలో చేపట్టనున్నట్లు ఎక్సైజ్‌శాఖ ఉపకమిషనర్‌ వివేకానందరెడ్డి తెలిపారు. అమీర్‌పేట ఎక్సైజ్‌స్టేషన్‌ పరిధిలో అత్యధిక సంఖ్యలో 22 మద్యం దుకాణాలకుగానూ 301 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. పాతబస్తీలోని ధూల్‌పేట స్టేషన్‌ పరిధిలో అత్యల్పంగా 12 దుకాణాలకు కేవలం 78 దరఖాస్తులు అందాయి. జిల్లాలో 1499 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.30 కోట్ల ఆదాయం సమకూరింది. కొన్ని ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధుల్లోని మద్యం దుకాణాలకు కేవలం మూడు నుంచి అయిదు చొప్పున దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్‌ శాఖ వాటిపై దృష్టి పెట్టింది. మద్యం వ్యాపారులు సిండికెట్‌గా మారి దరఖాస్తులు తక్కువ సంఖ్యలో వచ్చేలా చర్యలు తీసుకున్నారని భావిస్తున్న అధికారులు ఆయా దుకాణాలకు రీ టెండరింగ్‌ జరిపించేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం!

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.