close

సోమవారం, నవంబర్ 18, 2019

తాజా వార్తలు

ధూంధాంతో దద్దరిల్లిన నగరం

ఆర్టీసీ సమ్మెలో ఆటపాట
ఆందోళన మరింత ఉద్ధృతం
రాత్రిపూట తిరగని ఆర్టీసీ బస్సులు
ఈనాడు, హైదరాబాద్‌

మ్మెలో భాగంగా రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు 13వ రోజు ధూంధాంలతో హోరెత్తించారు. ఆర్టీసీ డిపోలు, బస్‌స్టేషన్లే కాదు.. ముఖ్యమైన కూడళ్లలో సమ్మెకు మద్దతుగా ఆందోళనలు నిర్వహించారు. కూకట్‌పల్లి వైజంక్షన్‌లో దరువు అంజన్న, షాద్‌నగర్‌ డిపో ముందు గోపన్న బృందాలు రాష్ట్రంలో సాగుతున్న పాలనను ఎండగట్టాయి. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి గొంతు కలిపాయి. నిరసనలు, మౌన దీక్షలు, మానవహారాలకు తోడు.. గురువారం పాట తోడవడంతో కార్మికుల్లో ఉద్యమ ఉత్సాహం రెట్టింపయింది. ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహిస్తుండగానే.. తాత్కాలిక సిబ్బందితో అధికారులు బస్సులను నడిపారు.

ఆందోళనలు నగరవ్యాప్తం
నిన్నమొన్నటి వరకూ ఆర్టీసీ డిపోలు, బస్‌స్టేషన్ల వరకే పరిమితమైన ఆందోళనలు ఇప్పుడు నగరవ్యాప్తమయ్యాయి. కూకట్‌పల్లి వైజంక్షన్‌, యూసుఫ్‌గూడ చౌరస్తా, ఇందిరాపార్కు ధర్నాచౌక్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్సు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, వీఎస్‌టీ చౌరస్తా.. ఇలా నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో కార్మికులకు మద్దతుగా విపక్ష నేతలు, పార్టీల అనుబంధ, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనను ఉద్ధృతం చేశారు.

 

రోడ్డెక్కిన బస్సులు 1500: వెంకటేశ్వరరావు, ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ ఈడీ
ఆర్టీసీ సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి అరకొరగా తిరుగుతున్న బస్సుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. గురువారం 1500 బస్సులు రోడ్డెక్కాయని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇందులో 350 బస్సులు అద్దెవి కాగా మిగతావి ఆర్టీసీవి. బస్సులు పగలు కొంతవరకూ తిరుగుతున్నా.. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత కనిపించడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక రాత్రి 10 అయిన తర్వాత ఒక బస్సు కూడా కనిపించడంలేదని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

మాయదారి యాప్‌లు!

ఏది కొనాలన్నా.. విక్రయించాలనుకున్నా.. క్లిక్‌ కొడితే చాలు. ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు లావాదేవీలకు వేదికగా మారాయి. మార్కెట్‌లోకి కొత్త మోడల్‌ రాగానే పాతవాటిని తక్కువ ధరకు విక్రయించేందుకు యువత, కార్పొరేట్‌ ఉద్యోగులు ఆసక్తిచూపుతున్నారు.  ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లు మరమ్మతులు ఉన్న చరవాణులు, ల్యాప్‌టాప్‌లు రీఫర్బిష్డ్‌ (పునరుద్ధరించినవి) విక్రయిస్తుంటాయి. కొత్త వాటితో పోల్చితే ధరలో సుమారు 30శాతం తేడా ఉంటుంది. ఈ సంస్థలు వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విక్రయానికి సిద్ధంగా ఉంచుతాయి. కొనుగోలు చేసిన అనంతరం ఏదైన సమస్య వస్తే సదరు సంస్థలకు ఫిర్యాదు చేస్తే రిప్లెస్‌మెంట్‌(మరో వస్తువు) చేస్తారు. ఈ నిబంధన ఆరు నెలల పాటు ఉంటుంది.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.