close

బుధవారం, ఆగస్టు 12, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

‘పట్టా’భిషేకం

కుక్కునూరు, న్యూస్‌టుడే అడవితల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ రైతులు పొట్ట కూటి కోసం నిషిద్ధ అటవీ ప్రాంతంలో చెట్లు కొట్టారు.. పుట్టలు తవ్వారు.. మోట్లు తీశారు. ఆపై వ్యవసాయం చేసుకున్నారు. అయితే వారు అటవీ చట్టాలను అతిక్రమించినందుకు జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ భూములకు వారిని హక్కుదారులను చేస్తుంది. అటవీ హక్కుల చట్టం 2005 కింద జిల్లాలో 778 మంది రైతులకు 1352 ఎకరాలకు హక్కు పత్రాలు అందజేయనుంది. ఇందుకు ఐటీడీఏ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. అటవీ హక్కుల చట్టం కింద 2005 డిసెంబరు 13 కంటే ముందు సాగులో ఉన్న ఆక్రమణదారులను గుర్తించి, వారికి ఆ భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. 2004-2009లో కొంతమందికి పట్టా హక్కులు ఇచ్చారు. తాజాగా ఆ చట్టం మళ్లీ తెరపైకి వచ్చింది.

యువతా మేలుకో.. ఓటు హక్కు అందుకో!

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దేశాభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే పాలకులను ఎన్నుకునేందుకు ఓటు వజ్రాయుధం వంటిది. అంతటి ప్రాముఖ్యం కలిగిన ఓటు హక్కును అర్హులందరికీ అందించేందుకు ఎన్నికల సంఘం ఏటా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్వహిస్తుంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఓటర్ల జాబితా సవరణను చేపట్టి ఓటు నమోదు, జాబితాపై అభ్యంతరాల స్వీకరణ తదితర ప్రక్రియలు నిర్వహించారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితాను 2020 ఫిబ్రవరి 14న విడుదల చేశారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.