close

బుధవారం, నవంబర్ 13, 2019

తాజా వార్తలు

కాగిత, నార సంచుల తయారీని ప్రోత్సహించాలి

జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి


సూచనలిస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ప్లాస్టిక్‌ సంచుల నిషేధం అమల్లో ఉన్నందున పట్టణ ప్రాంతాల్లో కాగిత, నార సంచులు ఉత్పత్తి చేసే యూనిట్లను ప్రోత్సహించాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన పరిశ్రమలు, ఖాదీ, కాయర్‌బోర్డు అధికారులతో శుక్రవారం సమీక్షించారు. జిల్లాలో ఉన్న ఈ తరహా పరిశ్రమలను గుర్తించి వారికి మరింత శిక్షణ ఇవ్వాలన్నారు. పాలిథిన్‌ సంచుల వినియోగం వల్ల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం ప్రధాన మంత్రి ఉపాధి యోజనపై సమీక్షించారు. ఈ పథకం కింద పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తుల్లో 270 మందిని ఎంపిక చేశారు. గ్రామ పంచాయతీల్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ యూనిట్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజరు బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.