close

మంగళవారం, నవంబర్ 19, 2019

తాజా వార్తలు

రాంజల చెరువులో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

ఆదోని నేరవార్తలు: రాంజల చెరువులో గల్లంతైన తిమ్మప్ప అనే ఇంటర్‌ విద్యార్థి మృతదేహం సోమవారం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే వాల్మీకినగర్‌కు చెందిన నాగరాజు దంపతుల కుమారుడు తిమ్మప్ప ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి పట్టణ శివారులో ఉన్న రాంజల చెరువుకు ఈత కోసం వెళ్లాడు. ఈ క్రమంలో చెరువులో గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు చెరువులోకి దూకి గాలించినా ఫలితం దక్కలేదు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది, గజ ఈతగాళ్లు చెరువులో దిగి తిమ్మప్ప ఆచూకీ కోసం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం మృతదేహాన్ని వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.