close

శుక్రవారం, నవంబర్ 15, 2019

తాజా వార్తలు

అమరవీరుల త్యాగాలే స్ఫూర్తి

ప్రజల సహకారంతో సమర్థ సేవలు

డీఐజీ కాంతిరాణాటాటా, ఎస్పీ సత్యఏసుబాబు


గౌరవ వందనం స్వీకరిస్తున్న డీఐజీ, ఎస్పీ తదితరులు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: పోలీసు అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విధుల్లో పునరంకితమవుదామని డీఐజీ కాంతిరాణాటాటా, ఎస్పీ సత్యఏసుబాబు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా సాయుధ బలగాల నుంచి డీఐజీ, ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1959 అక్టోబరు 21న లడక్‌ ప్రాంతంలో చైనాతో యుద్ధంలో 10 మంది జవాన్లు వీరమరణం పొందారన్నారు. వారి జ్ఞాపకార్థం ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు ఆయుధాల ప్రదర్శన, రక్తదాన శిబిరం తదితర కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పోలీసు సేవలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి సదస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మత ఛాందసవాదులు, అసాంఘిక శక్తుల నుంచి సామాన్య మానవులకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ప్రాణ త్యాగాలకు సిద్ధమవుతున్నారన్నారు. బహిరంగ సభ, పరీక్షలు, ర్యాలీలు ఇలా ఏవైనా పోలీసులు లేకుండా జరిగే పరిస్థితి లేదన్నారు. ప్రజలు పండగ రోజున కుటుంబ సభ్యులతో గడుపుతుంటే, పోలీసులు మాత్రం భద్రతా విధుల్లో ఉంటారన్నారు. ఏ సమస్య, విపత్తు వచ్చినా పోలీసులనే ఆశ్రయిస్తారని వారు తెలిపారు. ప్రజల సహకారంతోనే పోలీసులు సమర్థంగా సేవలు అందిస్తారన్నారు. 2018-19లో దేశ వ్యాప్తంగా అసాంఘిక శక్తులతో పోరాడి 292 మంది పోలీసులు ప్రాణాలను త్యాగం చేశారన్నారు. వారికి పేరుపేరుగా జోహార్లు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ డిల్లీరావు, జేసీ-2 సుబ్బరాజు, శిక్షణా కలెక్టర్‌ జాహ్నవి, ఏఎస్పీ రామాంజనేయులు, డీఎస్పీలు రామచంద్ర, వీర రాఘవరెడ్డి, శ్రీనివాసులు, రమాకాంత్‌, మహబూబ్‌బాషా, వెంకటరమణ, ఖాసీం సాహెబ్‌, రామకృష్ణయ్య, నరసింగప్ప, మురళీధర్‌, జిల్లా పోలీసు సంఘం ప్రతినిధులు త్రిలోక్‌నాథ్‌, జాఫర్‌, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నివాళులు అర్పిస్తున్న పోలీసు బలగాలు

ప్రతిభావంతులకు పురస్కారాలు

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు శాఖ విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించింది. ఇందులో ప్రతిభ చాటిన విద్యార్థులకు డీఐజీ కాంతిరాణాటాటా, ఎస్పీ సత్యఏసుబాబు బహుమతులు, పురస్కారాలు ప్రదానం చేశారు. పోలీసు పిల్లలకు తెలుగు మాధ్యమంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో లోకేశ్వరి (ప్రథమ), లక్ష్మీసాయి నందిని (ద్వితీయ), రాజశేఖర్‌ (తృతీయ), ఆంగ్ల మాధ్యమంలో గిరిజాబాయి (ప్రథమ), శ్రీతేజ (ద్వితీయ), యువతాసిని (తృతీయ), తెలుగు వక్తృత్వ పోటీల్లో సౌజన్య (ప్రథమ), పవన్‌కల్యాణ్‌ (ద్వితీయ), శ్యాంసన్‌ (తృతీయ), ఆంగ్ల మాధ్యమంలో లక్ష్మీ ప్రసన్న (ప్రథమ), సాయి హర్షవర్ధన్‌ (ద్వితీయ), సాయినాథ్‌నాయక్‌ (తృతీయ) బహుమతులు అందుకున్నారు. పాఠశాల/కళాశాల విద్యార్థుల్లో తెలుగు వ్యాసరచనలో అమరాపురానికి చెందిన ఏపీ బాలయోగి గురుకులం విద్యార్థి అక్షిత (ప్రథమ), రొద్దం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి నరసింహ (ద్వితీయ), గోరంట్ల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి మహమ్మద్‌ (తృతీయ), ఆంగ్ల మాధ్యమంలో పుట్టపర్తి కేజీబీవీ కళాశాల విద్యార్థిని రోషిని (ప్రథమ), కాలసముద్రం ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ విద్యార్థి హరికిరణ్‌గౌడ్‌ (ద్వితీయ), గాండ్లపెంట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సృజనశ్రీ (తృతీయ), పెయింటింగ్‌లో అనంతపురానికి చెందిన అనూష (ప్రథమ), హిందూపురానికి చెందిన మదహా (ద్వితీయ), సానియా (తృతీయ), కార్టూన్‌ పోటీల్లో థౌసిఫ్‌ (అనంతపురం), కల్పన (నార్పల), గాయత్రి (అనంతపురం) బహుమతులు దక్కించుకున్నారు. ఎస్సై ఆపై స్థాయి అధికారులకు ఆంగ్ల మాధ్యమ వ్యాసరచనలో మూడో పట్టణ స్టేషన్‌ సీఐ రెడ్డప్ప (ప్రథమ), ఆర్‌ఎస్సై రాజశేఖర్‌ (ద్వితీయ), నార్పల ఫణీంద్రనాథ్‌రెడ్డి (తృతీయ), తెలుగు మాధ్యమంలో రొళ్ల ఎస్సై మగ్బూల్‌బాషా (ప్రథమ), ఆర్‌ఎస్సై జాఫర్‌ (ద్వితీయ), లేపాక్షి ఎస్సై కృష్ణవేణి (తృతీయ) పురస్కారాలు అందుకున్నారు.

కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై వరకు వక్తృత్వంలో మీనా, మనెమ్మ, చలపతి, ఆంగ్ల మాధ్యమంలో కీర్తన, నరేష్‌బాబు (అనంతపురం గ్రామీణం) అవార్డులు అందుకున్నారు. కళాబృందంలో విశ్రాంత ఎస్సై రఘురామయ్య, హెచ్‌సీ బాలరాజుకు బహుమతులు ప్రదానం చేశారు. పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు. అనంతరం పోలీసులు ర్యాలీ నిర్వహించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.