close

శుక్రవారం, నవంబర్ 22, 2019

తాజా వార్తలు

భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలకు ఆహ్వానం

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : విద్యార్థుల్లో చదువుతోపాటు సంస్కారాన్ని, దేశభక్తి, దైవభక్తిని పెంపొందించేందుకు భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌పీ నేతలు రమేశ్‌బాబు, ఆనంద్‌ తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఆసక్తిగల విద్యార్థులతో భగవద్గీతలోని సాంఖ్య యోగంలోని శ్లోకాలను కంఠస్థం చేయించాలని ఉపాధ్యాయులకు కోరారు. పాఠశాల స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థుల్లో ఇద్దరు చొప్పున నవంబర్‌ 10న గద్వాలలో జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. పూర్వశిశు నుంచి రెండో తరగతి విద్యార్థులకు సాంఖ్యయోగంలోని 1-5 వరకు శ్లోకాలపై.. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు 1-10 వరకు శ్లోకాలపై పోటీలు ఉంటాయన్నారు. 6, 7వ తరగతుల వారికి 1-15 వరకు శ్లోకాలపై.. 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు 1-35 వరకు శ్లోకాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 94416 26339, 77805 61494 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.