close

గురువారం, నవంబర్ 14, 2019

తాజా వార్తలు

నట విక్రమార్కుడు

విలన్‌ పాత్రల్లో ప్రతిభతో రాణిస్తూ

 700లకు పైగా చలన చిత్రాల్లో నటన


గద్దలకొండ గణేష్‌ చిత్రంలో సీన్‌ వివరిస్తున్న డైరెక్టర్‌

పట్టు వదలకుండా భేతాళుడు వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ విజయం సాధించాడు విక్రమార్కుడు. ప్రతిభ చూపి ముందడుగు వేస్తే ఏదైనా సాధించాలని నాడే నిరూపించాడు. సినిమాలు చూస్తూ నటించాలనే కోరికను పెంచుకున్న ఓ యువకుడు. పట్టుబట్టి చిన్న పాత్రలు చేస్తూ నేడు విలన్‌ పాత్రల స్థాయి ఎదిగి భేష్‌ అనిపిస్తున్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమానే జీవితం అనుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్‌కు వెళ్లి సాయిబాబా గుడిలో పడుకుంటూ నిద్రాహారాలు మాని అవకాశాలకోసం ఎదురు చూశాడు. 19 ఏళ్లుగా టీవీ ధారా వాహికల్లో ఫైట్‌ మాస్టర్‌గా, విలన్‌గా నటిస్తూ ప్రతిభ చూపడంతో సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. నేడు సినిమాల్లో విలన్‌ నటుడిగా రాణిస్తూ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు విక్రమ్‌గౌడ్‌.

- న్యూస్‌టుడే, మంత్రాలయం

మంత్రాలయం సరిహద్దులోని చిన్న మంచాల(కర్ణాటక) గ్రామంలో నివాసముంటున్న ఈరప్ప, లక్ష్మీదేవిల కుమారుడు విక్రమ్‌ గౌడ్‌. చిన్న తనంలోనే అనుకోని పరిస్థితులతో అర్ధంతరంగా బడిమానేశాడు. పినతండ్రి సింధనూరులో నడుపుతున్న సినిమా టాకీస్‌లో చేరాడు. అక్కడే పనిచేస్తూ నిత్యం సినిమాలు చూస్తూ ఎప్పటికైనా తాను నటుడు కావాలని సంకల్పం పెంచుకున్నారు. వయస్సుతోపాటు లక్ష్యం చేరాలనే కోరిక ఎక్కువగా ఉండడంతో ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్‌కు వెళ్లాడు. ఫిలిమ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో చేరాడు. ఆలయానికి వచ్చే నటులతో పరిచయాలు పెంచుకుని అవకాశాన్ని అంది పుచ్చుకున్నారు. ధారా వాహికల్లో ప్రముఖ విలన్‌గా పేరుగాంచిన సెల్వరాజ్‌తో పరిచయం కావడంతో ఆయన గ్రూప్‌లో సహ విలన్‌ నటుడిగా అవకాశం వచ్చింది. తొలి నాళ్లలో స్రవంతి, నాగాస్త్రం, మొగలి రేకులు, చక్రవాకం, నాతిచరామి, ఆడదే ఆధారం ధారా వాహికల్లో ప్రతి నాయకుడు, సహాయ నటుడిగా నటించారు. స్వాతిచినుకులు, చంద్రముఖి, ధారావాహికల్లో ప్రధాన ప్రతినాయకుడిగా గుర్తింపు వచ్చింది. ఇందులో కొన్ని ఫైట్లకు మాస్టర్‌గా పనిచేశారు. అనంతరం సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. బాలకృష్ణ నటించిన పరమవీర చక్ర, పవన్‌కల్యాణ్‌ నటించిన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్‌ 150, అల్లు అర్జున్‌ సినిమా డీజే(దువ్వాడ జగన్నాథం)లో నటించారు. గద్దలకొండ గణేష్‌ చిత్రంలో హీరో వెనక ఉండే బృందంలో ఒకరిగా ఉన్నారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు లభించడంతో తెలుగు, తమిళం, కన్నడ సినిమా ధారావాహికల్లోనూ మంచి అవకాశాలు వచ్చాయి. సినిమాల్లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.