సోమవారం, డిసెంబర్ 16, 2019
ఈనాడు, నిజామాబాద్: మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఏలేటి అన్నపూర్ణమ్మ భాజపాలో చేరనున్నారు. కుమారుడు డాక్టర్ మల్లికార్జునరెడ్డితో కలిసి కమలం గూటికి చేరాలని నిర్ణయించుకొన్నారు. అమిత్ షా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా శనివారం దిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది. కొద్దిరోజుల కిందట భాజపా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎంపీ అర్వింద్ హైదరాబాద్లోని వారిఇంటికి వెళ్లి కలిశారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకున్నా.. తమ కుటుంబానికి ఇక్కడి ప్రజలతో ఉన్న పరిచయాల దృష్ట్యా మళ్లీ ప్రజా సేవ చేసేందుకు ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్లు అన్నపూర్ణమ్మ చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజలు భాజపానే ఆదరిస్తున్నారని, రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం ఆ పార్టీ అని భావించి, ఆ పార్టీ నేతలు స్వయంగా వచ్చి ఆహ్వానించిన క్రమంలో తాము ఈ ఆలోచన చేసినట్లు తమ చేరిక విషయంలో ఆమె వివరించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు