బుధవారం, డిసెంబర్ 11, 2019
గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఎంపీ అర్వింద్ భాజపా నాయకులు
నిజామాబాద్ అర్బన్, న్యూస్టుడే: ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని ఎంపీ అర్వింద్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ నుంచి రెండో రోజు గాంధీ సంకల్ప యాత్రను ఆయన ప్రారంభించారు. అనంతరం ఈ యాత్ర పెద్ద బజార్ నుంచి భాజపా పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...జిల్లాలో గతం కన్నా రెట్టింపు ధాన్యం దిగుబడి వచ్చినా, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఎలాంటి స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో ధాన్యాన్ని మార్కెట్యార్డ్డ్లో నిల్వ చేసేందుకు సైతం సరైన సౌకర్యాలు లేవన్నారు. ధాన్యం పండించడం కంటే విక్రయించడం ఇబ్బందికరమైన పరిస్థితిగా మారిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అధికారులకు సరైన సూచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మిల్లర్లతో పాటు ధాన్యం కొనుగోలుపై వెంటనే అధికారులు స్పందించి సమీక్ష ఏర్పాటు చేయకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయన్నారు. గాంధీ సంకల్ప యాత్రకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలి వచ్చారు. ఈ యాత్రలో భాజపా నాయకులు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బస్వా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు