మంగళవారం, డిసెంబర్ 10, 2019
అభివాదం చేస్తున్న నూతన కార్యవర్గ సభ్యులు
కామారెడ్డి గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ జూనియర్ అటవీ అధికారుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో సోమవారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా గీరయ్య, నగేష్‌గౌడ్, అరుణ్‌కుమార్‌లు వ్యవహరించారు. జిల్లా అధ్యక్షునిగా బాబు, ఉపాధ్యక్షునిగా సాయికుమార్, కార్యదర్శిగా మోజాంఅలీఖాన్, నిర్వాహక కార్యదర్శిగా సుల్తానా, సంయుక్త కార్యదర్శిగా స్రవంతి, కోశాధికారిగా ఫిరోజ్‌ఖాన్‌లు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాగాగౌడ్, భిక్షపతి, వెంకట్‌రెడ్డి, ఫారూక్, శ్రీకాంత్, బాబా పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు