గురువారం, డిసెంబర్ 05, 2019
భద్రాచలం, న్యూస్టుడే: వాజేడులోని మాతా శిశు ఆరోగ్య బృందంలో వైద్యాధికారి పోస్టును భర్తీ చేయనున్నట్లు ఐటీడీఏ అధికారులు ప్రకటించారు. అర్హులైన అభ్యర్థితో తాత్కాలిక పద్ధతిలో నియామకం చేయనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారు జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి 23-44 మధ్య వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. నేటి నుంచి ఈ నెల 20 లోగా భద్రాచలం అడిషనల్ డీఎంహెచ్వో కార్యాలయంలో వివరాలను అందించాలన్నారు. మన్యంలోని గిరిజన అభ్యర్థులకు, గతంలో మన్యంలో పనిచేసిన అనుభవం గలవారికి ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు