శనివారం, డిసెంబర్ 07, 2019
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్టుడే: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే మహిళా అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తు గడువును ఈనెల 17వరకు పొడిగించినట్లు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల కమ్యూనిటీ రిలేషన్స్ ఆఫీసర్ డి. చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినైరిలేషన్స్(డార్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే ఉద్యోగం, ఇతర పోటీ పరీక్షలకు ఇచ్చే శిక్షణకు దరఖాస్తు గడువు ఈనెల 11 కాగా పలువురి అభ్యర్థన మేరకు పొడిగించినట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన మహిళ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 24న ఆదివారం ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్ష ఉంటుందని తెలిపారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు