close

సోమవారం, డిసెంబర్ 09, 2019

తాజా వార్తలు

రేపట్నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

ఖమ్మం (కార్పొరేషన్‌) : ఈ నెల 14వ తేదీ నుంచి జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు అజీజ్‌ ఉల్‌ హక్‌ తెలిపారు. ఈ రోజు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారోత్సవాల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు వ్యాసరచన పోటీలు, కవి పరిచయాలు, పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో ఇప్పటికే 400 మంది విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణతోపాటు ఉచిత భోజన సౌకర్యం కల్పించినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో సంస్థ కార్యదర్శి అర్జున్‌, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.