శుక్రవారం, డిసెంబర్ 13, 2019
‘ఈనాడు’ కథనానికి స్పందించిన జీహెచ్ఎంసీ
ఈనాడు, హైదరాబాద్: పండగలు, ఉత్సవాల సందర్భంగా ప్రజాప్రతినిధులు, పోలీసులు రహదారులపై, ఇతరత్రా కేంద్రాల వద్ద తాత్కాలికంగా విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తుంటారని, వాటికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంటామని జీహెచ్ఎంసీ పేర్కొంది. అందులో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలో దర్గాలు, దేవాలయాల వద్ద ఎల్ఈడీ విద్యుద్దీపాలతో అలంకరణ పనులు చేపట్టామని ఎలక్ట్రికల్ విభాగం సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్ తెలిపారు. పండగలు, ఉత్సవాలతోపాటు, మమూలు రోజుల్లోనూ విద్యుద్దీపాలంకరణ పనులు చేపట్టినట్టు బిల్లులు సృష్టించి రూ.10కోట్ల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారంటూ బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. నామినేషన్ల కింద ఏజెన్సీలకు పనులు అప్పగించిన మాట వాస్తవమేనని, నిబంధనల ప్రకారం నడుచుకున్నామని వివరించారు. తాత్కాలిక దీపాల ఏర్పాటు పనులను నామినేషన్ పద్ధతిపై కేటాయించి నిర్దేశిత ధరల ప్రకారం బిల్లులు చెల్లిస్తున్నామన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు