close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

తాజా వార్తలు

గృహిణి ఆత్మహత్య

హయత్‌నగర్‌: అదనపు కట్నం కోసం వేధించడంతో గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన భవనీయుల మహేందర్‌ జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి. అతనికి 18 ఏళ్ల క్రితం జనగామకు చెందిన వాణి(32)తో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వారు మన్సూరాబాద్‌ లెక్చరర్స్‌ కాలనీలో ఉంటున్నారు. రెండేళ్లుగా మహేందర్‌ అదనపు కట్నం కోసం భార్యతో గొడవపడుతున్నాడు. కొద్ద్దిరోజుల క్రితం వాణి తల్లి జనగామలో ఇంటి స్థలాన్ని విక్రయించగా వచ్చిన డబ్బును మహేందర్‌కు ఇచ్చింది. అయినా వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనెల 11న మహేందర్‌ భార్యతో గొడవపడ్డాడు. వాణిని చంపుతానని బెదిరించాడు. వాణి విషయాన్ని తల్లికి ఫోన్‌ ద్వారా తెలియజేసి నిద్రమాత్రలు మింగింది. తల్లి, ఆమె పెద్ద కూతురు, కోడలు జనగామ నుంచి హయత్‌నగర్‌ వచ్చేసరికి వాణి స్పృహ కోల్పోయి పడి ఉంది. మంగళవారం ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందతూ మృతి చెందింది. మహేందర్‌ అదనపు కట్నం కోసం వాణిని కొట్టి బలవంతంగా నిద్రమాత్రలు మింగించి హత్య చేసినట్లు వాణి తల్లి నాగలక్ష్మి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.