శుక్రవారం, డిసెంబర్ 06, 2019
ప్రత్యేక కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు వినతిపత్రం సమర్పిస్తున్న వీఆర్వోల సంఘం ప్రతినిధులు
కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్‌టుడే: విధులు నిర్వహించాలంటే భయంగా ఉందని వీఆర్వోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రావు పేర్కొన్నారు. కలెక్టరేట్‌కు వీఆర్వోలు బుధవారం ర్యాలీగా వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తహసీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేయడం తమను కలచివేసిందని ఆవేదన చెందారు. న్యాయ స్థానాల్లో కేసుల్లో ఉన్న భూములకు పట్టాలు జారీ చేసే అధికారం తమకు లేదని, చాలా మంది రైతులు వీఆర్వోలే పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని అపోహ చెందుతున్నారని, దీంతో రైతులకు, వీఆర్వోలకు అంతరం పెరిగిపోయిందని వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వమే చొరవ చూపాలని కోరారు. అనంతరం స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలయ్య, డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు