సోమవారం, డిసెంబర్ 16, 2019
నర్సంపేట, న్యూస్టుడే: నర్సంపేటలోని ప్రభుత్వ సీహెచ్సీ ఆసుపత్రిని దిల్లీకి చెందిన కేంద్ర బృందం అధికారులు బుధవారం సందర్శించారు. కేంద్ర సెక్రటేరియెట్ ఓఎస్డీలు ఎండీ అయూబ్, మీర్జోద్దీన్, అవినాశ్శర్మ, నిరంజన్ కుమార్తో కూడిన అధికారుల బృందం జిల్లా డీఆర్డీఏ అధికారి దివాకర్రాయ్ ఆధ్వర్వంలో ప్రభుత్వ కమ్యూనిటీ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(సీహెచ్సీని) సందర్శించారు. ప్రసూతి, మాతాశిశు మరణాలను నియంత్రించేందుకు అమలు చేస్తున్న కేసీఆర్ కిట్టు తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ ఈ పథకం అమల్లోకి వచ్చాక ఆసుపత్రిలో జరిగిన ప్రసూతిల సంఖ్య, సాధారణ కాన్పులు, శస్త్ర చికిత్సల వివరాలను కేంద్ర అధికారుల బృందానికి వివరించారు. వైద్యురాళ్లు నవత, ప్రియాంక, పూర్ణిమ, మత్తు వైద్యుడు కిషన్, ప్రియదర్శిని, హెడ్ నర్సు రమాదేవి పాల్గొన్నారు.
జిల్లా వార్తలు