సోమవారం, డిసెంబర్ 16, 2019
పిట్లం, న్యూస్టుడే: పిట్లం మండలంలోని బండాపల్లి సమీపంలో ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలం వాజీద్నగర్కు చెందిన సాయిలు, నిజాంసాగర్ మండలం బుర్గుల్కు చెందిన గంగారాం ద్విచక్రవాహనంపై బాన్సువాడ వైపునకు వెళ్తున్నారు. బండారెంజల్కు చెందిన హైదర్, అజీజ్ బాన్సువాడ నుంచి బండారెంజల్ వస్తుండగా బండాపల్లి సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో సాయిలు, గంగారాం తీవ్రంగా గాయపడ్డారు. హైదర్, అజీజ్లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు