శుక్రవారం, డిసెంబర్ 06, 2019
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె ప్రభావం కార్మికులపై తీవ్రప్రభావం చూపిస్తోంది. సమ్మెపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని మనస్తాపంతో సిద్దిపేటకు చెందిన నాగేశ్వర్ (42) అనే కార్మికుడు మృతి చెంది గంటలైనా గడవక ముందే మరో కార్మికుడు ఆస్పత్రి పాలయ్యాడు. సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో కలత చెంది, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక హైదరాబాద్లోని మంథని డిపోకు చెందిన కండక్టర్ సమ్మయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో చేరాడు. సమ్మయ్యది పెద్దపల్లి జిల్లా ఖమ్మంపల్లి మండలంలోని సీతంపల్లి గ్రామం. ప్రస్తుతం వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు