close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

తాజా వార్తలు

వేధింపులతో దేవస్థానం ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఈవో, ఆయన సతీమణి కారణమని బాధితుడి భార్య ఆరోపణ
చికిత్స పొందుతున్న ఉద్యోగి

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: రామతీర్థం పుట్టాలమ్మ దేవస్థానం ఉద్యోగి నరసింహ ఆత్మహత్యాయత్నం చేశారు. గత మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ పట్టణంలోని విద్యానగర్‌ సమీపంలో ఈవో నివాసం ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అక్కడి వారు ఆయనను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య రాధ వివరాల మేరకు గత కొన్ని రోజులుగా దేవస్థానం ఈవో సుబ్బారెడ్డి, ఆయన భార్య తన భర్తను వేధిస్తున్నారు. బుకింగ్‌ క్లర్కుగా పనిచేస్తున్న తన భర్త ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సెలవు చీటీ రాసి ఈవో భార్య చేతికి అందించారు. విధుల్లోకి చేరిన తర్వాత జీతం ఇవ్వకుండా ఆలస్యం చేయడంతోపాటు, విధులకు సక్రమంగా హాజరు కాలేదంటూ ప్రవేశ మార్గం వద్ద విధులు చేయాలని ఈవో, ఆయన భార్య ఆదేశాలు ఇచ్చారు. స్థాయి తగ్గించడంతో బాధపడుతుండేవారు. మరోవైపు మూడు నెలలు గడుస్తున్నా జీతం ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగించి మరొకరిని నియమిస్తామని ఈవో దంపతులు బెదిరించినట్లు వాపోయారు. వీరి వేధింపులు తాళలేకననే తన భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ఆమె ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితుడి భార్య కోరారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ పట్టణ సీఐ ఎన్వీ రమణ ఈవో నివాసం వద్దకు చేరుకున్నారు. ఇందుకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. నరసింహా ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.