శనివారం, డిసెంబర్ 14, 2019
పొల్లూరు (మోతుగూడెం), న్యూస్టుడే: చింతూరు మండలం పొల్లూరు జలపాతంలో పురుషుడి మృతదేహాన్ని మోతుగూడెం పోలీసులు గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెలగదూరు గ్రామానికి చెందిన దొడ్డ కృష్ణప్రసాద్ (23) కనిపించడం లేదని అయిదు రోజుల క్రితం అందిన పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎస్సై బి.వెంకటేష్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం పొల్లూరు జలపాతంలో తేలిన మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ మృతదేహం ఆచూకీ తెలియని దొడ్డ కృష్ణప్రసాద్గా గుర్తించారు. సమాచారాన్ని ఆయన కుటుంబికులకు అందజేశారు. అయిదు రోజుల క్రితం స్నేహితులతో కలిసి వనసమారాధనకు వచ్చిన కృష్ణప్రసాద్ అదృశ్యమయ్యాడు. రెండు రోజుల పాటు మోతుగూడెం సమీప అటవీ ప్రాంతంలో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు