శుక్రవారం, డిసెంబర్ 13, 2019
సూక్ష్మ, చిన్నతరహా మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి సంఘం
ఈనాడు, హైదరాబాద్: జాతీయ స్థాయిలో మహిళల కోసం ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్నతరహా మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి సంఘం (వీఎండ్) అధ్యక్షురాలు డీవీవీ శ్రీలక్ష్మి వాణి కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా శాఖల సహాయ మంత్రి ప్రతాప్‌చంద్ర సారంగిని కోరారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన మంత్రిని హైదరాబాద్‌లో తమ సంఘం ప్రతినిధులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. పారిశ్రామిక రంగంలో మహిళల వాటా కేవలం 7శాతంగానే ఉందని, మహిళలకు సరైన అవకాశాలు, ప్రోత్సాహం లభించడం లేదన్నారు. ప్రత్యేక విధానం కింద ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటించడం ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. పరిశ్రమల స్థాపన కోసం ముద్ర రుణాలలో 50శాతం విధిగా మహిళలకు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు. విభజనచట్టం కింద పారిశ్రామిక రాయితీలను ఇవ్వాలన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు