శుక్రవారం, డిసెంబర్ 06, 2019
తెవివి క్యాంపస్(డిచ్పల్లి): తెవివి పరిధిలోని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని సీవోఈ ఘంటా చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు కళాశాలలు వర్సిటీ నిర్ణయించిన దాని కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. బీఏ, బీ.కామ్ కోర్సుల విద్యార్థులు రూ.700 చెల్లించాలన్నారు. బీఎస్సీ, బీబీఏ కోర్సుల విద్యార్థులు రూ.800 చెల్లించాలని తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు రూ.200 ఉంటుందన్నారు. ఇతర యూనివర్సిటీ, బోర్డు నుంచి మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు రూ.125 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఇంతకంటే ఎక్కువ వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు