close

బుధవారం, డిసెంబర్ 11, 2019

తాజా వార్తలు

మహాసభలను విజయవంతం చేయండి

తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు


గోడపత్రికలను విడుదల చేస్తున్న నాయకులు

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : వైద్యారోగ్య శాఖలోని అన్ని సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వీవీ రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం ఎదుట మహాసభలకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేసి మాట్లాడారు. ఈనెల 17న హైదరాబాదులో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలకు ఉద్యోగులు జిల్లా నుంచి భారీ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు మతీన్‌, ప్రదీప్‌, సూర్యబాబు, శ్రీను, మణెమ్మ, నాగేంద్రం, నవీన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.