శుక్రవారం, డిసెంబర్ 13, 2019
కార్పొరేషన్, న్యూస్‌టుడే : కరీంనగర్ నగర పరిధిలోని మరో మూడు కూడళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అంబేడ్కర్ చౌరస్తా, కమాన్ కూడలి, బస్టాండ్‌లోని శ్రీపాదచౌక్, నాకా చౌరస్తాను అన్ని హంగులతో తీర్చిదిద్దారు. కార్కానగడ్డ గాంధీ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తాలో పనులు ప్రారంభించారు. తాజాగా మరో మూడు కూడళ్లను అందంగా మార్చడానికి ప్రణాళికలు తయారు చేయగా.. మొదటి దశలో స్మార్ట్‌సిటీ పనుల్లో భాగంగా చేపట్టేందుకు నిర్ణయించారు. పనులు వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అమరవీరుల స్తూపం, పొట్టి శ్రీరాములు విగ్రహం, ఆచార్య జయశంకర్ కూడలి ఉన్నాయి. ఇందులో పూల మొక్కలు, వాటర్ ఫౌంటేన్, గ్రీనరీ, లైటింగ్స్ ఏర్పాటు చేయనున్నారు. టవర్‌సర్కిల్ అభివృద్ధి పనులను రూ.11.45 కోట్లతో అమృత్సర్ తరహాలో తయారు చేయనున్నారు. వీటికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే రాగా పనులను సైతం చేపట్టేందుకు పట్టణ ప్రణాళిక అధికారులు బృహత్తర ప్రణాళిక ప్రకారం కొలతలు నిర్వహించేందుకు కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు