శుక్రవారం, డిసెంబర్ 13, 2019
పరీక్ష కేంద్రం వద్ద ఎస్పీతో చర్చిస్తున్న డీఐజీ వెంకట్రామిరెడ్డి
కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు మండల పరిధిలోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష సజావుగా ముగిసింది. కర్నూలు రేంజ్ డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పర్యవేక్షణలో జరిగిన పరీక్షకు 637 మందికిగాను 512 మంది హాజరయ్యారు. బయోమెట్రిక్ విధానంలో పరీక్షకు హాజరైన అభ్యర్థుల వేలిముద్రలను సేకరించి పరీక్ష నిర్వహించారు. కళాశాల సమన్వయకర్తలు కిషోర్‌కుమార్, సతీష్‌కుమార్ డీఎస్పీ యుగంధర్‌బాబు, సీఐలు ఓబులేశ్, మధుసూదన్‌రావు, లక్ష్మయ్య, జాన్సన్‌బాబు, సీసీఎస్సీఐ ఓబులేష్, ఫింగర్ ప్రింట్ బ్యూరో సీఐ శివారెడ్డి, ఇకాప్ ఇన్‌ఛార్జి రాఘవరెడ్డి పరీక్ష నిర్వహణలో పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు