శుక్రవారం, డిసెంబర్ 13, 2019
రూ.3 లక్షలు డిమాండ్
మూడు గంటల్లోనే ఛేదించిన పోలీసులు
బాలాపూర్, న్యూస్‌టుడే: మీర్‌పేటలో ఓ బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఏడేళ్ల బాబును పదిహేనేళ్ల మైనర్ బాలుడు కిడ్నాప్ చేసేందుకు పథకం రచించాడు. మూడు గంటల పాటు తల్లిదండ్రులు, కాలనీవాసులు, పోలీసులను ముచ్చెమటలు పట్టించాడు. మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని టీఎస్ఆర్ కాలనీలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి కుమారుడు (7) బడంగ్‌పేటలోని ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటుండగా.. అతనికి మాయ మాటలు చెప్పిన మైనర్ బాలుడు మీర్‌పేట నుంచి అల్మాస్గూడ వరకు తీసుకెళ్లి బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తండ్రి మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించి ఫోన్ డేటా ఆధారంగా కిడ్నాపర్‌ను గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీర్‌పేట సీఐ యాదయ్య తెలిపారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు