close

గురువారం, డిసెంబర్ 12, 2019

తాజా వార్తలు

లోకో పైలెట్‌ మృతితో తల్లడిల్లిన కుటుంబం

 19న ఏలూరులో అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు
 సహాయక చర్యల్లో జాప్యమే మృతికి కారణమని శేఖర్‌ తండ్రి ఆరోపణ

కాచిగూడ, న్యూస్‌టుడే: కాచిగూడ స్టేషన్‌ వద్ద లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌ రైలు.. కర్నూల్‌-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ (హంద్రీ) ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఘటనలో ఎంఎంటీఎస్‌ లోకో పైలెట్‌ శేఖర్‌ మృతి చెందారు. వృద్ధాప్యంలో అండగా ఉంటాడనుకున్న కొడుకు మృతితో తండ్రి, భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో అతని భార్య తల్లడిల్లారు.
ఒక్కడే కుమారుడు: ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన జోసెఫ్‌-కుమారి దంపతులకు కుమారుడు ఎల్‌సీహెచ్‌ శేఖర్‌(35), కూతురు జహ్నవి ఉన్నారు. జోసెఫ్‌ రైల్వే ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ పూర్తి చేసిన శేఖర్‌ 2011 ఆగస్టు 17న రైల్వేలో చేరారు. 2014లో శేఖర్‌ తల్లి అనారోగ్యంతో మరణించారు. 2015లో ఏలూరుకు చెందిన సాలి(27)తో శేఖర్‌ వివాహం జరిగింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఎంఎంటీఎస్‌ లోకో పైలెట్‌గా పనిచేస్తున్న శేఖర్‌కు మూడేళ్ల కుమారుడు ఇమ్మాన్యుయేల్‌ రాజ్‌, 40 రోజుల వయసున్న మరో కుమారుడున్నారు. గత సోమవారం జరిగిన ఎంఎంటీఎస్‌ ప్రమాదంలో రైలు ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన శేఖర్‌ను 8 గంటల పాటు శ్రమించి బయటకు తీసి చికిత్స నిమిత్తం నాంపల్లి కేర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు.

అన్నివిధాలా ఆదుకుంటాం: మృతదేహాన్ని ఏలూరుకు తరలించడానికి దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ అధికారులు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 19న ఏలూరులోని సెయింట్‌ జేవియర్‌నగర్‌లో అంత్యక్రియలు జరుగుతాయని శేఖర్‌ పెద్దనాన్న కుమారుడు రవిరాజ్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. చికిత్స పొందుతున్న సమయంలో తక్షణసాయంగా రూ.25 వేలు, అంత్యక్రియల కోసం మరో రూ.25 వేలను శేఖర్‌ కుటుంబానికి అందజేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎక్స్‌గ్రేషియా అందజేసి ఆదుకుంటామని రైల్వే హైదరాబాద్‌ డివిజనల్‌ మేనేజర్‌ (డీఆర్‌ఎం) సీతారాంప్రసాద్‌ తెలిపారు. సహాయక చర్యల్లో జాప్యం కారణంగా తన కుమారుడు మరణించాడని శేఖర్‌ తండ్రి ఆరోపించారు. పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.