close

శనివారం, డిసెంబర్ 07, 2019

తాజా వార్తలు

అమ్మో.. ఆ మండలమా!

బాధ్యతల స్వీకరణకు కొందరు తహసీల్దార్ల వెనుకంజ!
సమస్యాత్మక మండలాల్లో పనిచేయలేమంటూ ఆవేదన
ఈనాడు, హైదరాబాద్‌

ట్టకేలకు తహసీల్దార్లకు స్థానచలనం కలిగింది. ఇదే వారిలో కొందరికి తలనొప్పిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా భారీసంఖ్యలో తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం వారికి పోస్టింగ్స్‌ ఇచ్చింది. అధికశాతం బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగానే ఉన్నా.. లోలోన ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల పైరవీలు, భూవివాదాలు, రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండే మండలాల్లో విధినిర్వహణ కత్తిమీద సాముగా భావిస్తున్నారు. ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి దారుణహత్య అనంతరం రెవెన్యూ ఉద్యోగులు సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేందుకు వెనుకంజ వేస్తున్నారు. మూడు జిల్లాల్లో సుమారు 10-12 మండలాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడ విధులు నిర్వర్తించేందుకు భద్రత కావాలంటూ ఓ తహసీల్దార్‌ అభిప్రాయపడ్డారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారుగా వెంకట్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారుగా కె.వెంకట్‌రెడ్డిని నియమిస్తూ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎస్‌.హరీష్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 4న అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి పూర్తిస్థాయి తహసీల్దారు నియామకం జరగలేదు. తాజాగా బదిలీల్లో కె.వెంకట్‌రెడ్డికి అబ్దుల్లాపూర్‌మెట్‌ బాధ్యతలు అప్పగించారు. గతంలో ఈయన ఇబ్రహీంపట్నం తహసీల్దారుగా పనిచేశారు. గత ఎన్నికల వేళ బదిలీపై వెళ్లారు. రంగారెడ్డి జిల్లా పరిపాలన అధికారి(ఏవో)గా కె.సుశీల, బాలాపూర్‌ తహసీల్దారుగా డి.శ్రీనివాసరెడ్డి, శంకర్‌పల్లికి పి.కృష్ణకుమార్‌, కందుకూర్‌కు ఎస్‌.జ్యోతి, మహేశ్వరానికి ఆర్‌.పి.జ్యోతి, చేవెళ్లకు ఎం.షర్మిల, మొయినాబాద్‌కు కె.అనిత, ఫరూఖ్‌నగర్‌కు జె.పండు, హయత్‌నగర్‌ ప్రమీలారాణి, సరూర్‌నగర్‌కు ఎల్‌.రామ్మోహన్‌, రాజేంద్రనగర్‌కు చంద్రశేఖర్‌గౌడ్‌, మంచాలకు దేవుజ, కొందుర్గుకు అబ్దుల్‌ రహ్మన్‌ఖాన్‌, జిల్లేడు చౌదరిగూడేనికి రాములు, యాచారానికి నాగయ్య, గండిపేటకు రాజశేఖర్‌, షాబాద్‌కు అమర్‌లింగంగౌడ్‌, నందిగామ తహసీల్దారుగా హైదర్‌అలీ, కలెక్టరేట్‌ ఈ-సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా నయీముద్దీన్‌ నియమితులయ్యారు.

హైదరాబాద్‌ జిల్లాలో..
తహసీల్దార్‌     మండలం
వేణుగోపాల్‌     అంబర్‌పేట్‌
వి.వి.ఎల్‌.చంద్రకళ అమీర్‌పేట
ఎన్‌.బి.విష్ణుసాగర్‌   ఆసిఫ్‌నగర్‌
ఎస్‌.రాములు     బహదూర్‌పుర
ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి   చార్మినార్‌
పి.అయ్యప్ప       గోల్కొండ
సీహెచ్‌.లలిత     హిమాయత్‌నగర్‌
సునీల్‌నథాని     మారేడుపల్లి
కె.జానకి         ముషీరాబాద్‌
ఎం.వి.వి.ప్రసాద్‌రావు సైదాబాద్‌
సీహెచ్‌.సుజాత     షేక్‌పేట్‌
కె.బాలశంకర్‌     సికింద్రాబాద్‌
తహసీల్దార్‌               మండలం
కె.మాధవిరెడ్డి     తిరుమలగిరి
బి.శైలజ డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌
కె.వి.వి.సీతారామ్‌   డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌
ఈ.నవీన్‌     డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌
ఎండీ జహురుద్దీన్‌ తహసీల్దార్‌, యూఎల్‌సీ, సికింద్రాబాద్‌
హసీనాబేగం   తహసీల్దార్‌, యూఎల్‌సీ, హైదరాబాద్‌
మల్లేష్‌కుమార్‌   తహసీల్దార్‌, యూఎల్‌సీ, సికింద్రాబాద్‌
కె.రామకృష్ణ       తహసీల్దార్‌, యూఎల్‌సీ, హైదరాబాద్‌
సబాసుల్తానా       తహసీల్దార్‌(ఎల్‌పీ) హౌజింగ్‌ సెక్షన్‌

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.