close

బుధవారం, డిసెంబర్ 11, 2019

తాజా వార్తలు

శ్మశానవాటికే ఇల్లైంది..!

మృతదేహాన్ని వేయడానికి నిరాకరించిన యజమానులు

శ్మశానవాటికలో రాజన్న మృతదేహం

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: సమాజంలో రోజురోజుకు మానవీయ విలువలు దిగజారుతున్నాయి. జనగామ పట్టణంలో అద్దె ఇంటి వారు మృతదేహాన్ని వేయనివ్వకపోవడంతో శ్మశానవాటికలోనే రాత్రంతా ఉంచి అంత్యక్రియలు చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... జనగామ బాలాజీనగర్‌లో కొత్తకొండ రాజన్న(58) అతని భార్య సత్యలక్ష్మి, ఆయన కుమారుడు సంతోష్‌తో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. రాజయ్య బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ ఇటీవల అక్కడే నివాసముంటున్నారు. అప్పుడప్పుడు జనగామకు భార్య, కొడుకు దగ్గరకు వచ్చి వెళ్లేవారు. సోమవారం సాయంత్రం రాజయ్య గుండెనొప్పితో మృతి చెందగా, కుటుంబసభ్యులు మృతదేహాన్ని జనగామకు తీసుకొచ్చారు. మృతదేహం అంబులెన్స్‌లో ఉండగానే, అద్దె ఇంటి యజమాని శవాన్ని తమ ఇంటి ముందు వేయొద్దని హుకూం జారీ చేశారు. జనగామలోనే ఉంటున్న రాజన్న అత్తగారింట్లో వేద్దామని అనుకున్నా, వారు కూడా అంగీకరించకపోవడం మరింత ఆవేదనకు గురి చేసింది. పెద్దమనుషులు చెప్పినా వారు వినిపించుకోలేదు. చేసేది లేక రాజన్న మృతదేహాన్ని పట్టణంలోని నెహ్రూ పార్కు సమీపంలో ఉన్న శ్మశానవాటికకు సోమవారం రాత్రి 8 గంటలకు తీసుకెళ్లారు. రాత్రంతా మృతదేహంతోపాటు అతని భార్య, కొడుకు, అతని బంధువులు మాత్రమే శ్మశానవాటికలో ఉన్నారు. అసలే శ్మశానవాటికలో ఒకే ఒక విద్యుత్తు దీపం, ఉండడం, ఇతర సౌకర్యలేమీ లేకపోవడంతో రాత్రంతా ఆ బాధిత కుటుంబం నరకయాతన అనుభవించింది. రాజన్న కొడుకు తరపున కొందరు స్నేహితులు సాయంగా రావడంతో ఎట్టకేలకు మంగళవారం ఉదయం 11 గంటలకు రాజన్న దహన సంస్కారాలు పూర్తి చేశారు.

రాజన్న (పాతచిత్రం)

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.