సోమవారం, డిసెంబర్ 16, 2019
పిగ్లిపూర్ (అబ్దుల్లాపూర్‌మెట్): చదువుకొనేందుకు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి నగరానికి వచ్చిన విద్యార్థి చెరువులో ఈతకు దిగి గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాశికి చెదిన సురేష్‌కుమార్ తనయుడు విశ్వకర్మ సందీప్(19) యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని దేశ్‌ముఖ్‌లోని సెయింట్ మేరీస్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సందీప్ దేశ్‌ముఖ్‌లో తోటి విద్యార్థులతో కలిసి గదిలో ఉంటున్నాడు. బుధవారం మిత్రులతో కలిసి పిగ్లిపూర్ గ్రామ పరిధిలోని బొమ్మల చెరువుకు ఈతకు వెళ్లాడు. చెరువులో గుంతలు ఉండడంతో మునిగిపోయాడు. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సందీప్ జాడ తెలియరాలేదు.
జిల్లా వార్తలు