శుక్రవారం, డిసెంబర్ 06, 2019
హయత్‌నగర్, న్యూస్‌టుడే: హయత్‌నగర్ ఠాణా పరిధి కుంట్లూర్ గ్రామ శివారులో ఈనెల 11న హత్యకు గురైన చెట్ల లింగమ్మ(50) అలియాస్ బేతమ్మ కేసును పోలీసులు ఛేదించారు. ఆమె ఆభరణాల కోసమే నిందితుడు ఆ హత్య చేసినట్లు నిర్ధరించారు. ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ బుధవారం తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. లింగమ్మది సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఎర్రారం గ్రామం. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను వీడి పదేళ్లుగా సోమాజిగూడ సమీప మక్తాలో కూలీపని చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉండేది. యూపీ నుంచి బాల్యంలోనే నగరానికి వచ్చిన కందూరి రమేష్ నాగోల్ సమీపంలో ఉండే బంధువుతో కలిసి మార్బుల్ పనులు చేస్తుంటాడు. దురలవాట్లకు బానిసయ్యాడు. కూలీలను మక్తా అడ్డామీద నుంచి తీసుకెళ్లేవాడు. లింగమ్మను సైతం పలుమార్లు పనులకు తీసుకెళ్లాడు. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. రమేష్‌కు రోజువారీగా వచ్చే ఆదాయం సరిపోక అప్పులు చేశాడు. ఇంటి అద్దె సైతం కట్టలేకపోయాడు. లింగమ్మను అంతమొందించి ఆమె ఆభరణాలను తీసుకోవాలనుకున్నాడు. అతడికి ఈనెల 11న లింగమ్మ ఫోన్‌చేసి పనులు ఉన్నాయా అని అడిగింది. నాగోల్ సమీపంలో ఉన్నాయని చెప్పి, రాజ్‌భవన్ రోడ్డులోని రైల్వేక్రాసింగ్ వద్దకు రావాలని సూచించాడు. మార్బుల్ పనులకు అవసరమైన సుత్తి, చాకు తీసుకుని ద్విచక్ర వాహనంపై ఆమెను ఎక్కించుకుని నాగోలుకు వచ్చాడు. సాయంత్రం వరకు కల్లు దుకాణ పరిసరాలలో తిప్పి రాత్రి కుంట్లూర్ దారిలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అఘాయిత్యానికి పాల్పడి, అనంతరం సుత్తితో తలపై బలంగా కొట్టాడు. ఆమె కిందపడిపోగా కత్తితో గొంతు కోశాడు. ఒంటిపై ఉన్న నగలను తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన రమేష్ విషయాన్ని భార్య సుజాతకు చెప్పి ఆభరణాలను అందించాడు. మార్వాడీ దుకాణంలో విక్రయించగా వచ్చిన రూ.11 వేలలో రూ.3200 ఇంటి అద్దెగా చెల్లించారు. కుంట్లూర్‌లోని వ్యవసాయ బావి వద్ద పశువులను మేపుతున్న రైతు నర్సింహారెడ్డి సమాచారం మేరకు పోలీసులు లింగమ్మ చనిపోయిన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రమేష్‌ను నిందితుడిగా గుర్తించి బీజేఆర్ కాలనీలోని ఇంట్లో అతడిని పట్టుకున్నారు. నిందితుడితోపాటు భార్యనూ రిమాండ్‌కు తరలించారు. కొంత నగదు, హత్యకు వినియోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ జయరాం, హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ సతీష్, డీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు