బుధవారం, డిసెంబర్ 11, 2019
నార్సింగి ఠాణాలో ఉద్రిక్తత
ముట్టడించిన బంధువులు
నార్సింగి, న్యూస్‌టుడే: స్థల వివాదంలో మాట్లాడాలని చెప్పడంతో పోలీసు స్టేషన్‌కు పిలిపించగా.. ఓ వ్యక్తి పోలీసులతో మాట్లాడుతుండగానే కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతనుమరణించినట్లు వైద్యులు చెప్పడంతో మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో నార్సింగి పోలీసు స్టేషన్లో బుధవారం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మాదాపూర్ ఏసీపీ శ్యాం ప్రసాద్‌రావు, ఇన్స్పెక్టర్ రమణాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన షేక్ నయీముద్దీన్(60) స్థానికంగా పంక్చర్ దుకాణం నడిపిస్తున్నాడు. వీరి ఇంటి సమీపంలో ఉన్న గ్రామకంఠం భూమి విషయంలో వీరికి, ఆ భూమిని ప్లాట్లుగా కొన్న వారికి మధ్య వివాదం ఉంది. ప్లాటు కొన్న వహీద్ తనప్లాటు చదును చేసుకోవాల్సి ఉందని, అయితే నయీముద్దీన్ కుటుంబం తమపై దాడిచేసే అవకాశం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులు ఉంటేనే స్థలంలోకి వెళ్లాలని పోలీసు అధికారులు సూచించగా సదరు వ్యక్తులు రెండు రోజులలో కోర్టు ఉత్తర్వులు తెచ్చుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు బుధవారం నయీముద్దీన్ సోదరులను స్టేషన్‌కు పిలిపించారు. నయీమొద్దీన్ అందుబాటులో ఉన్న తన సోదరునితో పాటు స్టేషన్‌కు వచ్చారు. అడ్మిన్ ఎస్ఐ శ్రీధర్, వహీద్ ఫిర్యాదు గురించి వివరించి, కోర్టు ఉత్తర్వులు తీసుకువస్తే మీరు కోర్టులో విషయం తేల్చుకోవాలని, స్థానికంగా శాంతిభద్రల పరిస్థితి సృష్టించే యత్నం చేయవద్దని సూచిస్తుండగా, నిలబడిన నయీముద్దీన్ ఒక్కసారిగా కూలబడిపోయాడు. అతని సోదరుడు ఇతరులు ద్విచక్ర వాహనంపై స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా పల్స్రేట్ తక్కువగా ఉందని, పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించడంతో లంగర్‌హౌస్‌లోని మరో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. మృతుని బంధువులు, స్థానిక నాయకులు స్టేషన్‌కు చేరుకుని ఇన్స్పెక్టర్ రమణగౌడ్తో విగ్వాదానికి దిగారు. ఎస్ఐ కొట్టడంతోని తమ సోదరుడు కిందపడి మరణించాడని ఆరోపించారు. మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు ఆందోళన చేస్తున్న మృతుని బంధువులు, ఎంఐఎం నాయకులు ముఖ్తార్, మాజీ సర్పంచి వెంకటేశ్‌యాదవ్ సమక్షంలో చర్చించారు. నయీముద్దీన్ కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్‌కు పిలిపించడానికి కారణమైన ఫిర్యాదు దారు వహీద్పై చర్య తీసుకోవాలని, అదే విధంగా నయీముద్దీన్ మృతికి కారణమైన ఎస్ఐ శ్రీధర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు