బుధవారం, డిసెంబర్ 11, 2019
ఎంపికైన విద్యార్థులు
ఎల్లారెడ్డి, న్యూస్టుడే: రాష్ట్ర స్థాయిలో జరిగే గురుకుల పాఠశాలల నమూనా పార్లమెంట్ పోటీలకు ఎల్లారెడ్డి గురుకుల పాఠశాల నుంచి 25 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మహేందర్, పీడీ నర్సింగరావు తెలిపారు. జోనల్ స్థాయిలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను వారు అభినందించారు. రాష్ట్ర స్థాయిలో సైతం గెలుపొంది పాఠశాలకు పేరు తీసుకురావాలని వారు కోరారు. కార్యక్రమంలో రాజేశ్వర్, సమీన, నవీన్ ఉన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు