మంగళవారం, డిసెంబర్ 10, 2019
ఆదోనిమార్కెట్: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు రాయితీ భోజన కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు. గత ప్రభుత్వం ‘అన్న’ పథకాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల అనంతరం భోజన పథకం ఆగిపోవడంతో గత నెల 26 తేదిన ‘అందని రాయితీ భోజన’ శీర్షికన ఈనాడులో కథనం ప్రచురితం అయింది. స్పందించిన ప్రభుత్వం పథకం కొనసాగింపునకు పచ్చజెండా ఊపడంతో ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రూ.15కు రైతులకు రాయితీ భోజనం అందిస్తామన్నారు. రోజు 1500 మంది రైతులకు అందించే ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మన్ దేవిశెట్టి ప్రకాష్, వైకాపా నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు