సోమవారం, డిసెంబర్ 16, 2019
పెద్దపల్లి: జిల్లాలోని పెద్దపల్లి మండలం చండపల్లి సమీపంలోని విద్యుత్ కేంద్రం వద్ద అప్పన్నపేట గ్రామానికి చెందిన సదయ్య(33) అనే యువకుడ్ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడ్ని బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలాన్ని డీసీపీ రవీందర్, ఏసీపీ అబీబ్ఖాన్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు