సోమవారం, డిసెంబర్ 16, 2019
కామారెడ్డి: కామారెడ్డి శివారు లింగాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. అల్లుడే తన మామను గొడ్డలితో నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన యలకుర్తి రాజలింగానికి ఏకైక కూతురు భీమవ్వ. కొడుకులు లేకపోవడంతో లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ను ఇల్లరికం తెచ్చుకున్నాడు. సోమవారం రాత్రి ద్విచక్రవాహనం విషయంలో మామ అల్లుళ్ల మధ్య గొడవ జరిగింది. ఉదయం మాట్లాడుకుందామని అనుకున్నారు.
రాత్రి 11 గంటలకు ఇంటి ముందు పెళ్లి విందు వద్దకు బభీమవ్వ వెళ్లింది. ఇదే అదునుగా భావించిన లక్ష్మణ్ ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొని రాజలింగం తలపై బాదాడు. రాజలింగం అక్కడిక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు